- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బంగారానికి ఆకాశమే హద్దు
దిశ, వెబ్‌డెస్క్: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. దేశీయ మార్కెట్లో రోజుకో కొత్త రికార్డును నమోదు చేస్తూ పసిడి పరుగులు తీస్తోంది. సామాన్యుడు బంగారం వైపు చూడ్డానికి కూడా లేనంత భారీగా దూసుకెళ్తున్నాయి. ఇటీవల బంగారం స్పీడు ఇదే స్థాయిలో ఉంటుందని నిపుణులు సైతం చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరల గమనానికి తగినట్టుగానే దేశీయంగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం కూడా మదుపర్లు ఎక్కువగా బంగారంపై ఆసక్తి చూపిస్తూ, భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
దీంతో బంగారంపై పెట్టుబడులతో పసిడి ధర రోజుకో రికార్డును బద్దలు కొడుతోంది. గతవారం రూ. 52,000 మార్కును దాటిన బంగారం ధరలు సోమవారం మరింత స్పీడుగా ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారట్ల బంగారం రూ. 820 పెరిగి రూ.54,300 ధరకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం రూ. 730 పెరిగి రూ. 49,780కి చేరింది. వెండి సైతం బంగారం బాటలోనే పయనించింది. హైదరాబాద్‌లో వెండి ధర రూ.3,722 పెరిగి రూ.64,945కు చేరుకుంది. ఇక, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పరిశీలిస్తే..24 క్యారెట్ల బంగారం ధరలు చెన్నైలో రూ. 54,300 ఉంది. ముంబైలో రూ. 51,650 ఉండగా, ఢిల్లీలో రూ. 52,000, కోల్‌కతాలో రూ. 52,450, బెంగళూరులో రూ. 53,530గా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక, అంతర్జాతీయంగా బంగారం ధర 1 శాతం పెరిగి 1,920 డాలర్లకు చేరుకుంది.