గాంధీ జయంతి రోజున గాడ్సే జిందాబాద్ పోస్టులు.. వరుణ్ గాంధీ ట్వీట్ వైరల్

by Anukaran |
గాంధీ జయంతి రోజున గాడ్సే జిందాబాద్ పోస్టులు.. వరుణ్ గాంధీ ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్ : అక్టోబర్ 2 అనగానే మహాత్మాగాంధీ జయంతి అందరికీ గుర్తుకు వస్తుంది. జాతిపిత, మహాత్మా అని పిలుచుకునే గాంధీజీ.. జయంతి సందర్భంగా దేశంలోని ప్రముఖులు, యువత.. గాంధీని స్మరించుకుంటారు. కానీ, అనూహ్యంగా సామాజిక మాధ్యమాల్లో చాలా మంది నెటిజన్లు మాత్రం.. గాంధీని చంపిన నాథురామ్ గాడ్సే‌ను జిందాబాద్ అని పోస్టులు పెడుతున్నారు.

దీనిపై పిలబిత్ నియోజకవర్గ MP వరుణ్ గాంధీ మండిపడ్డారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో స్పందించారు. గాంధీ దేశానికి ఎంతో సేవ చేశాడు. భారత్‌కి ఒక శక్తిగా నిలిచి మనకు అధికారాన్ని అందించిన గొప్ప నేత గాంధీ అని కొనియాడారు. గాంధీ భారత దేశానికి ఒక మార్గదర్శకుడు, ఒక సూపర్ పవర్.. అటువంటి గాంధీ జయంతి రోజున గాంధీని చంపిన గాడ్సే‌ను జిందాబాద్ అని ప్రశంసించడం భారతదేశాన్ని అవమానించడమే అని వరుణ్ గాంధీ అన్నారు. ఇటువంటి చర్యల వలన దేశ గౌరవం తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story