రెండు రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారు 

by srinivas |
రెండు రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారు 
X

దిశ, ఏపీ బ్యూరో: దుష్ట శక్తులపై విజయానికి చిహ్నంగా ఇంద్రకీలాద్రిపై శనివారం దుర్గమ్మ మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. అష్టమి, నవమి తిథులు ఒకే రోజు రావడంతో ఉదయం దుర్గాష్టమిని పురస్కరించుకొని దుర్గాదేవిగా, మధ్యాహ్నం నుంచి మహిషాసురమర్ధినీదేవిగా దుర్గమ్మ కటాక్షించారు. లోకకంటకుడైన దుర్గమాసురుడిని అష్టమి తిథినాడు వధించి ఇంద్రకీలాద్రిపై స్వయంగా అమ్మవారు ఆవిర్భవించారు.

మధ్యాహ్నం అమ్మవారు అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురుడిని సంహరించి దేవతలు, ఋషులు, మానవుల కష్టాలను తొలగించినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీకనకదుర్గమ్మ నిజ స్వరూపం కూడా ఇదే కావడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed