- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలవరం : ఎన్నో ఏళ్ల నిరీక్షణకు నేడు అంకురార్పణ
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో నిర్మాణ దశలో ఉన్న జాతీయ ప్రాజెక్టు పోలవరంలో శుక్రవారం కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కాసేపట్లో అప్పర్ కాఫర్ డ్యాం స్పిల్ వే మీదుగా గోదావరి జలాలు విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు అప్రోచ్ ఛానెల్ ద్వారా డెల్టాలకు అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్, మంత్రి ఆళ్లనాని వర్చువల్ విధానంలో తిలకించనున్నారు.
అయితే, ఎన్నో ఎళ్ల నిరీక్షణ తర్వాత పోలవరం ప్రాజెక్టులో తొలి అంకానికి ఏపీ ప్రభుత్వం, మేఘా సంస్థ అంకురార్పణ చేయనుంది. దీని ద్వారా రికార్డు స్థాయిలో 6.6కిలోమీటర్ల మేర గోదావరి జలాలను మళ్లించనున్నారు. అతి తక్కువ సమయంలో మేఘా సంస్థ ఈ నిర్మాణాన్ని పూర్తి చేయగా స్పిల్ వే, రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్ కు గోదావరి జలాలు మళ్లనున్నాయి. అక్కడ నుంచి తూర్పు, పశ్చిమ కాల్వల ద్వారా గోదావరి డెల్టాకు నీరు చేరునుంది.