నిజాంసాగర్ గేట్ల నిర్వహణ అధ్వానం

by Shyam |
నిజాంసాగర్ గేట్ల నిర్వహణ అధ్వానం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్వహణపై గోదావరి వ్యాలీ కమిషనర్ మధుసూదన్ రావు మండిపడ్డారు. ఆయన గురువారం ప్రాజెక్టును తనిఖీ చేశారు. వరద గేట్ల నిర్వహణ అధ్వానంగా ఉందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సమయంలో మంజీర నదికి వరద రావడం లేదని, అక్టోబర్‌లో నిజాంసాగర్‌కు సింగూరు నుంచి నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. అనంతరం పొచారం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం జుక్కల్‌లోని కౌలాస్ నాలా ప్రాజెక్టును తనిఖీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed