- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంత దారుణమా? ఏపీని దేవుడే కాపాడాలి: చంద్రబాబు
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ ఎక్కువవుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూనే, ఏపీ వాసులు కరోనాతో సహజీవనం చేయాలని సీఎం చెబుతున్నారు. మరోవైపు క్వారంటైన్ సెంటర్లలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని కరోనా బాధితులు ఆరోపిస్తున్నారు. క్వారంటైన్ సదుపాయాలు చూసి కొందరు ఇళ్లకు వెనుదిరుగుతున్న ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలు దాటాయి.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకే రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరిగుగుతున్నాయని మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీని ఆ దేవుడే కాపాడాలని బాబు వ్యాఖ్యానించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు ఒక వీడియోను కూడా పోస్టు చేశారు.
ఆ వీడియోలో ఏముందంటే.. ఓ గ్రామంలో కరోనా అనుమానితుడు ఫోన్ చేయడంతో అతనిని ఎక్కించుకునేందుకు అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ ఎక్కేందుకు తలుపులు తీయడంతో ఆ వ్యక్తి దిగ్భ్రాంతికి గురయ్యాడు. అలాంటి అంబులెన్స్ ఎక్కితే అనుమానిత లక్షణాల నిర్ధారణ అవుతాయని ఆందోళన చెందాడు. ఎందుకంటే అప్పటికే ఆ అంబులెన్స్ కరోనా అనుమానితులతో నిండిపోయింది. లోపల అంతమంది ఉంటే తానెక్కడ ఎక్కాలంటూ ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ వీడియో పోస్టు చేసిన చంద్రబాబు… “108 అంబులెన్స్ లో కరోనా అనుమానితులను జంతువులను కుక్కినట్టుగా ఎక్కించడం చూడ్డానికి భయానకంగా ఉంది. 108 కోసం చేసిన పబ్లిసిటీ అంతా దీనికోసమేనా! ఇదంతా చూస్తుంటే, ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని భావించాల్సి వస్తుంది. ఆ దేవుడే ఆంధ్రప్రదేశ్ ను కాపాడాలి” అంటూ ట్వీట్ చేశారు.