రెండు డోసుల టీకా వేసుకున్న వారికి గోఎయిర్ ప్రత్యేక రాయితీ!

by Harish |
go air
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ గోఎయిర్ ప్రయాణీకులకు ప్రత్యేక ఆఫర్‌ను మంగళవారం ప్రకటించింది. కొవిడ్-19 వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో వినియోగదారులు కరోనా రెండు డోసులను తీసుకున్నవారికి 20 శాతం రాయితీని అందించనున్నట్టు వెల్లడించింది.దేశీయంగా ప్రయాణించే వినియోగదారులు గోవకి పథకం ద్వారా ఈ రాయితీని పొందడానికి అవకాశం ఉంటుందని, అలాగే, భారత్‌లోని ప్రయాణీకులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ల బుకింగ్ సమయానికి రెండు టీకాలు వేసుకున్న వారికే ఇది అమలవుతుంది. దీనికోసం ప్రయాణీకులు ప్రభుత్వం నుంచి జారీ చేసిన కొవిడ్-19 టీకా ధృవీకరణ పత్రాన్ని అందుబాటులో ఉంచుకోవాలని లేదంటే విమానాశ్రయంలోని చెక్-ఇన్ కౌంటర్‌లో ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌లో వివరాలను చూపించడం తప్పనిసరి అని గోఎయిర్ సంస్థ వివరించింది. బుకింగ్ రోజు నుంచి 15 రోజుల మధ్య ప్రయాణ తేదీలకు ఈ రాయితీ లభించనుంది.

Advertisement

Next Story