వరంగల్ కలెక్టరేట్‌కు భూమి కేటాయింపు.. జీవో విడుదల

by Shyam |
వరంగల్ కలెక్టరేట్‌కు భూమి కేటాయింపు.. జీవో విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో : వరంగల్, వరంగల్ రూరల్‌గా ఉన్న జిల్లాలను వరంగల్, హన్మకొండ జిల్లాలుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హన్మకొండ‌లో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని హన్మకొండ జిల్లాకు కేటాయించారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాకు కూడా కలెక్టర్ సముదాయాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.

వరంగల్‌లోని అజంజాహి మిల్లు గ్రౌండ్ స్థలంలో ఈ సముదాయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించి స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర చేనేత జౌళి శాఖను కోరింది. ఈ నేపథ్యంలో చేనేత జౌళి శాఖ‌కు చెందిన 6.16 ఎకరాల భూమిని కలెక్టరేట్ సముదాయానికి కేటాయించేందుకు అంగీకరించింది. దీనికి సంబంధించిన జీవోని గురువారం ప్రభుత్వం విడుదల చేసింది. వరంగల్ కలెక్టరేట్ కోసం స్థలాన్ని కేటాయించడంపై టీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అజంజాహి మిల్ గ్రౌండ్‌లో తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో, నాయకులతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సంబరాలు చేసుకున్నారు.

Advertisement

Next Story