ఇంటర్ విద్యార్థినికి డ్రగ్స్ ఇచ్చి.. ఐదుగురు గ్యాంగ్ రేప్

by Sumithra |
ఇంటర్ విద్యార్థినికి డ్రగ్స్ ఇచ్చి.. ఐదుగురు గ్యాంగ్ రేప్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థినిపై ఓ బాలుడు సహ ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. కాలేజీ నుంచి బయటకు వచ్చిన అమ్మాయికి మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర జిల్లాకు చెందిన విద్యార్థిని (17) ఫిబ్రవరి 22 న కాలేజీకి వెళ్లింది. ఆ తర్వాత తన స్నేహితుడి ఇంటికి వెళ్లింది. అక్కడ కూల్ డ్రింక్ తాగిన ఆమెకు కొద్ది సేపటికే మత్తుగా అనిపించడంతో ఇంటికి వెళ్లడానికి బయలుదేరింది. అయితే ఆమె స్నేహితుడు ఇంటి దగ్గర దింపుతానని విద్యార్థినిని కురుక్షేత్రంలోని ఉమ్రీ చౌక్ సమీపంలోని ఓ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ హోటల్‌లో పనిచేసే యువకుడితోపాటు మరో నలుగురు ఉన్నారు. మత్తులో ఉన్న ఆమెకు డ్రగ్స్ ఇచ్చి వారంతా కలిసి అత్యాచారం చేశారు.

బాలిక రోజు ఉదయం 7 గంటలకు కాలేజీకి వెళ్లి, మధ్యాహ్నం 1.30 గంటలకు ఇంగ్లిష్ కోచింగ్ సెంటర్‌కు వెళ్తుంది. సాయంత్రం 4 గంటలకు ఇంటికి తిరిగి వెళ్లేది. కానీ ఆ రోజు అమ్మాయి రాత్రైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తెలిసిన వారితోపాటు ఆమె స్నేహితులను వాకాబు చేసినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె అదృశ్యంపై బరారాచౌక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా రాత్రి 7 గంటల సమయంలో లాడ్వా పట్టణం వైపు నుండి మోటారుసైకిల్‌పై ఇద్దరు యువకులు బాలికను మధ్యలో కూర్చోబెట్టుకుని రావడాన్ని చూశారు. అమ్మాయి స్కూల్ యూనిఫామ్‌లో ఉండడంతో ఆమెను గుర్తించిన తల్లిదండ్రులు బైక్‌ను అడ్డగించారు. ఆ సమయంలో అమ్మాయి తలపై ఓ యువకుడు కంట్రీ మేడ్ తుపాకీని గురి పెట్టి కూర్చున్నాడు. కుటుంబ సభ్యులు చాకచక్యంగా వ్యవహరించి వారిలో ఒక్కరిని పట్టుకుని బంధించారు. కాగా బాలిక ఆ సమయంలో కూడా డ్రగ్స్ మత్తులో ఉన్నది.

బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కురుక్షేత్ర ఎస్పీ హిమాన్షు గార్గ్ గురువారం మీడియాకు చెప్పారు. అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒకరు మైనర్ బాలుడు కాగా, నలుగురు 18 ఏళ్ల యువకులు ఉన్నారని తెలిపారు. వీరిలో ఒకరు బాధితురాలికి సమీప బంధువని పేర్కొన్నారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కౌర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed