ఆడపిల్లలు కరాటే విద్యను నేర్చుకోవాలి : ప్రొటెం చైర్మన్

by Shyam |   ( Updated:2021-11-15 07:11:15.0  )
Legislative Council
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆత్మరక్షణకు కరాటే దోహద పడుతోందని, ఆడపిల్లలు కరాటేను విధిగా నేర్చుకోవాలని తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన కరాటే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థిని, విద్యార్థులను తెలంగాణ శాసనమండలి ఆవరణలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అనంతరం విద్యార్థులను అభినందించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు ప్రతిభ కనబర్చినవారికి చేయూతను అందిస్తోందన్నారు. అన్ని రంగాల్లోని క్రీడలను నిర్వహిస్తూ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీస్తోందన్నారు.

కరాటే, మార్షల్ ఆర్ట్స్ లాంటి క్రీడలు విద్యార్థినీ, విద్యార్థులకు ఎంతో దోహదపడతాయన్నారు. ఆడపిల్లలు కరాటే నేర్చుకుంటే తమను తాను రక్షించుకోవచ్చు అన్నారు. క్రీడాకారులు క్రీడల్లో రాణించి రాష్ట్రానికి పేరుప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌లు భానుప్రసాద రావు, ఎంఎస్ ప్రభాకర్ రావు, నాంపల్లి టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీ ఆనంద్, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed