- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాటల్లేవ్.. అంతా యాక్షనే.. ప్రియుడి కోసం ప్రియురాలు ఏం చేసిందంటే..?
దిశ, ఏపీ బ్యూరో: ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తానే ప్రాణమన్నాడు. దీంతో ఆ యువతి అతడి ప్రేమను అంగీకరించింది. ఇక ప్రేమను అంగీకరించాక ఏడేళ్లుగా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ప్రేమ ముసుగులో లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. చివరికి పెళ్లి ఊసు ఎత్తేసరికి పెళ్లి లేదు, గిళ్లి లేదు అంటూ ప్లేట్ ఫిరాయించాడు. ఇక తానూ మోసపోయానని తెలుసుకున్న యువతి ప్రియుడు ఇంటిముందు మౌన పోరాటానికి దిగింది. ప్రస్తుతం విజయనగరంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
వివరాలలోకి వెళితే.. కుంభికోట గ్రామనికి చెందిన నిమ్మక నిర్మల, శిఖవరం గ్రామానికి చెందిన బండి రవిలు ఇద్దరూ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. త్వరలో పెళ్లి చేసుకుంటామని చెప్పి రవి ఆమెకు దగ్గరయ్యాడు. అతని లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. ఇక గత కొద్ది రోజులుగా నిర్మల పెళ్లి విషయం ఎత్తడంతో నెమ్మదిగా జారుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో నిర్మల, బండి రవిని తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. తనను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టంలేదని రవి తెగేసి చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించింది. తనకు న్యాయం చేయాలంటూ ప్రియుడు ఇంటిముందు ధర్నాకు దిగింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, రవితో తనకు పెళ్లి చేయాలని నిర్మల డిమాండ్ చేస్తోంది.