ఫ్యాన్ రిపేర్ చేస్తానని వచ్చిన ప్రియుడు.. ప్రియురాలు చేసిన పనికి తల్లిదండ్రులు షాక్

by Sumithra |   ( Updated:2021-03-26 01:15:23.0  )
ఫ్యాన్ రిపేర్ చేస్తానని వచ్చిన ప్రియుడు.. ప్రియురాలు చేసిన పనికి తల్లిదండ్రులు షాక్
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో ప్రేమ క్రూరత్వంగా మారిపోయింది. ప్రేమించకపోయినా, మోసం చేసినా వారిపై దాడులు చేస్తుండడం ఫ్యాషన్ గా తయారయ్యింది. అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకొంటే ప్రేమించిన అబ్బాయి లైంగిక వేధింపులకు గురిచేసాడనో, లేక అమ్మాయిపై యాసిడ్ దాడి చేసాడనో చాలాసార్లు వింటూనే ఉంటాం. అయితే ప్రేమించిన అబ్బాయి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని అతడిపై యాసిడ్ దాడి చేసిందో యువతి. ఈ దాడిలో యువకుడు మృతి చెందడం సంచలనం సృష్టిస్తుంది. ఈ క్రూరమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది.

ఆగ్రాకు చెందిన దేవేంద్ర రాజ్‌పుత్, సోనమ్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. అయితే వీరి పెళ్ళికి అమ్మాయి వాళ్ళింట్లో ఒప్పుకున్నా, అబ్బాయి వాళ్ళింట్లో ఒప్పుకోలేదు. దీంతో దేవేంద్ర కు కుటుంబ సభ్యులు వేరొక అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న సోనమ్ కోపోద్రేకురాలైంది. సీలింగ్ ఫ్యాన్‌ను రిపేర్ చేయాలంటూ బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి పిలిచి అతడిపై యాసిడ్ చల్లింది. ఈ దాడిలో దేవంద్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు. సోనమే తన కుమారుడిపై యాసిడ్ దాడి చేసి చంపేసినట్లు అతని పేరెంట్స్ ఆగ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed