- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుటుంబ సభ్యుల ఒత్తిడి.. ఉరేసుకున్న యువతి..!
by Sumithra |
X
దిశ, పరిగి : పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో అది భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పరిగి మండలం సయ్యద్ పల్లి గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అనిత(28)కు తండ్రి సంగయ్య వచ్చే నెలలో నిశ్చితార్థం నిశ్చయించారు. అయితే, ఆ యువతికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.
తనకు ఈ పెళ్లి వద్దని పలుమార్లు ఇంట్లో చెప్పినా, కుటుంబీకులు ఏమాత్రం వినకుండా ఆమెను ఒత్తిడి చేయడంతో అనిత మనస్తాపానికి గురైంది. తన పెళ్లిని ఆపేందుకు పలుమార్లు యత్నించి విఫలం కావడంతో వేరే దారిలేక చావే శరణ్యమనుకుంది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు.
Advertisement
Next Story