- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rape on Minor : నెలల తరబడి బాలికపై అత్యాచారం.. షాక్ ఇచ్చిన గ్రామ పెద్దల తీర్పు
దిశ, వెబ్‌డెస్క్: పొట్టచేతపట్టుకుని బతుకుదెరువు కోసం వచ్చిన ఓ బాలికను ఓ యువకుడు నమ్మించి మోసం చేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి లొంగతీసుకొని గర్భవతిని చేశాడు. ఈ విషయం తెలిసి యువకుడిని శిక్షించాల్సిన గ్రామపెద్దలు సైతం యువకుడికి సపోర్ట్ చేస్తూ బాలికకు అబార్షన్ చేయించిన దారుణ ఘటన జనగామ జిల్లా లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని రఘునాథపల్లి మండలం బాంజీపేటకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ కుటుంబం కొన్నేళ్ల క్రితం వచ్చి బాంజీపేటలోనే స్థిరపడ్డారు. అక్కడే కూలిపనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు.
అయితే గత కొద్దిరోజుల నుంచి గ్రామానికి చెందిన సంపంగి రవీందర్ అనే యువకుడు వలస వచ్చిన కుటుంబంలోని బాలిక వెంటపడడం మొదలుపెట్టాడు. ప్రేమిస్తున్నానంటూ బాలిక చుట్టూ తిరుగుతూ వేధించేవాడు. ఈ నేపథ్యంలోనే బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అయితే కొద్దీ రోజులకు బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం కాస్తా గ్రామపెద్దలు దృష్టికి రావడంతో పెద్దలు యువకుడిని పిలిచి అడిగారు.
రవీందర్ తాను చేసిన తప్పు ఒప్పుకొంటున్నానని, బాలికకు అబార్షన్ కి అయ్యే ఖర్చు తాను భరిస్తానని తెలిపాడు. దీంతో సరే అన్న గ్రామపెద్దలు మారుమాట్లాడకుండా యువకుడి దగ్గర రూ. 30 వేలు తీసుకొని బాలికకు అబార్షన్ చేయించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న బాలిక బంధువులు స్వగ్రామం నుంచి వచ్చి రవీందర్ పై దాడి చేశారు. తప్పు చేసినవాడ్ని శిక్షించకుండా డబ్బు కోసం అమ్మాయి జీవితంలో ఆడుకుంటారా .. ? అంటూ యువకుడిపై, గ్రామపెద్దలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి, కోర్టుకు తరలించారు.