- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్రెండ్‌షిప్ డే వేడుకలో విషాదం.. మద్యం మత్తులో అమ్మాయి మృతి
దిశ, వెబ్‌డెస్క్: ఫ్రెండ్‌షిప్ డే వేడుకల్లో మత్తు చిత్తు చేసింది. ఫుల్‌గా తాగేయడంతో రోడ్డుపై సాఫీగా వెళ్లాల్సిన కారు పల్టీలు కొట్టింది. ఫలితంగా ఓ అమ్మాయి ప్రాణం పోయింది. తల్లిదండ్రులను విషాదంలోకి నెట్టిన ఈ ప్రమాదం హైదరాబాద్‌లోని గచ్చబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన ఆశ్రిత కెనడాలో ఎంటెక్ చదువుతోంది. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఆమె స్నేహితుల(అభిషేక్,సత్య ప్రకాష్, తరుణీ)తో కలిసి ఫ్రెండ్‌షిప్ డే వేడుకల్లో పాల్గొంది. ఇదే సమయంలో ఆమె స్నేహితులు డ్రింక్ చేయడంతో… ప్రధాన రోడ్డు వెంబడి వెళితే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందని భయపడ్డారు. ఈ నేపథ్యంలోనే కొండాపూర్ మై హోమ్ మంగళ మీదుగా అతి వేగంతో అభిషేక్ డ్రైవింగ్ చేసి రోడ్డు పక్కనే ఉన్న బండరాళ్లను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో కారు వెనక డోరు తెరుచుకోవడంతో కిందపడిపోయిన ఆశ్రిత తలకు తీవ్ర గాయం కావడంతో కన్నుమూసింది. మరో ముగ్గురు స్నేహితులకు గాయాలు అయ్యాయి.