బ్రేకింగ్ : బేకరిలో యువతి హల్‌చల్.. మెడ పట్టుకుని మరీ పోలీసులు..!

by Anukaran |   ( Updated:2021-12-04 06:01:01.0  )
బ్రేకింగ్ : బేకరిలో యువతి హల్‌చల్.. మెడ పట్టుకుని మరీ పోలీసులు..!
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో ఓ యువతి రెచ్చిపోయింది. మోతీనగర్‌లో గల మిడ్ ల్యాండ్ బేకరిలో నానా హంగామా సృష్టించింది. బేకరికి వచ్చిన కస్టమర్లతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారిపైకి ఫుడ్స్ ఐటమ్స్ విసిరిగొట్టింది. ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారితోనూ గొడవకు దిగుతూ దాడికి యత్నించింది. తీరా బేకరి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు అక్కడకు చేరుకున్నారు.

వారితో కూడా ఈ యువతి అలాగే ప్రవర్తించడంతో చివరకు మహిళా పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో తీసుకెళ్లే టైంలో కూడా యువతి నానా రభస చేయడంతో లేడీ పోలీసులు బలవంతంగా మెడ పట్టుకుని అందులోకి ఎక్కించారు. ప్రస్తుతం ఆమెను ఎస్‌ఆర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, ఆ యువతి అలా ప్రవర్తించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story