మామతో బాలిక చాటింగ్.. అది చూసిన బాబాయ్ ఏం చేశాడంటే.?

by Anukaran |   ( Updated:2021-09-30 23:00:12.0  )
మామతో బాలిక చాటింగ్.. అది చూసిన బాబాయ్ ఏం చేశాడంటే.?
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ‌సెల్‌ఫోన్‌లో మాట్లాడుతోందని అన్న కూతురిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు కిరాతకుడైన బాబాయ్. సదురు యువతి చిక్సిత పొందుతూ మృతి చెందిన షాకింగ్ ఘటన మియాపూర్‌లో జరిగింది. వివరాల ప్రకారం.. మియాపూర్‌లో హనీఫ్ కాలనీకి చెందిన బాధితురాలు.. కీసర గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది.

అయితే కరోనా కారణంగా ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ‌న్‌‌లైన్ క్లాసుల కోసం ఆ బాలికకు తన తండ్రి సెల్ ఫోన్ కొనిచ్చాడు. అనంతరం ఆ బాలిక.. తనకు వరుసకు మామ అయ్యే వ్యక్తితో చాటింగ్ చేస్తుండటాన్ని తన బాబాయ్ గమనించాడు. దీంతో బాలికను చాటింగ్ చేయొద్దంటూ మందలించాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో బాలిక తండ్రి లేని సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

కోపంతో బాలికపై తన వెంట తెచ్చిన కిరోసిన్‌ను పోసి బాబాయ్ నిప్పంటించాడు. దీంతో బాలిక శరీరం అగ్నిలో కాలిపోయింది. సదరు బాలికను చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.

Advertisement

Next Story