ప్రమాదాల నివారణకు పాదచారుల వంతెనలు

by Shyam |
ప్రమాదాల నివారణకు పాదచారుల వంతెనలు
X

దిశ, న్యూస్​బ్యూరో: రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా రద్దీ ఎక్కువగా వున్న ప్రధాన రహదారుల్లో పాదచారుల వంతెనలను నిర్మిస్తున్నట్లు జీహెచ్​ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. మల్కాజిగిరి సర్కిల్ నేరేడుమెట్ క్రాస్ రోడ్డులో రూ.2.60కోట్లతో నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి ( పాదచారుల వంతెన) పనులను బొంతు రామ్మోహన్ పరిశీలించారు. ఎఫ్ఓబిపై వ్యక్తమైన అభ్యంతరాల గురించి స్థానికులతో చర్చించారు. స్థానికులకు ఇబ్బంది కలుగకుండా నిర్మాణం చేపడతామని మేయర్​ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మేయర్​ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న సమయంలో జరుగుతున్న ప్రమాదాల వల్ల కుటుంబాలకు, వాహనదారుల కుటుంబాలకు తీరని నష్టం జరుగుతోందని తెలిపారు. ప్రశాంతంగా రోడ్డును దాటేందుకు అనువుగా ఆధునిక పద్దతిలో పాదచారుల వంతెనలను నగర వ్యాప్తంగా నిర్ణిస్తున్నట్లు తెలిపారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు అందరికి ఆమోదయోగ్యంగా అలైన్​మెంట్​లో మార్పులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

Advertisement

Next Story