రేవంత్ రెడ్డి ట్వీట్.. షాపింగ్ మాల్ కూల్చివేసిన జీహెచ్ఎంసీ

by Sumithra |   ( Updated:2021-10-18 06:04:51.0  )
రేవంత్ రెడ్డి ట్వీట్.. షాపింగ్ మాల్ కూల్చివేసిన జీహెచ్ఎంసీ
X

దిశ, వెబ్‌డెస్క్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌కు జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. ఉప్పల్‌ రింగ్ రోడ్డులో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న షాపింగ్ మాల్‌ను సోమవారం మధ్యాహ్నం అధికారులు దగ్గరుండి కూల్చివేయించారు. ఇటీవల ఉప్పల్ రింగ్ రోడ్డు సమీపంలో అక్రమ కట్టడాలు భారీగా వెలిశాయి. ఈ నేపథ్యంలోనే మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకురాగా, వారు చర్యలు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed