- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉచితంగా అంతిమయాత్ర.. అంబులెన్స్‌లు ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ పరిధిలో ఉచితంగా అంబులెన్స్ సర్వీసులు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కొవిడ్ సెకండ్ వేవ్ మొదలైన తర్వాత వేల సంఖ్యలో మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు లక్షల రూపాయలను దోచుకున్నారు. రెండు నెలలుగా ఈ దోపిడీ జరుగుతున్నా, ఎన్ని ఫిర్యాదులు వచ్చినా జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వహించింది. చివరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉచితంగా గ్రేవ్ యార్డు వరకూ తరలిచేందుకు 14 అంబులెన్స్ లను ఏర్పాటు చేసినట్టు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ప్రకటించారు. అంతిమ యాత్ర రథాలుగా పిలిచే ఈ అంబులెన్స్ సర్వీసులను ఉపయోగించుకునేందుకు సర్కిళ్ల వారీగా ఇన్ చార్జీలను నియమించారు. మరణించిన వారిని ఇండ్లు, ఆస్పత్రుల నుంచి శ్మశాన వాటికలకు ఈ రథాలు ఉచితంగా చేర్చుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఫ్రీ అంబులెన్స్ సేవలు
జోన్ – కాంటాక్ట్ నెంబర్లు
ఎల్ బీ నగర్ – 9100091941, 9701365515
చార్మినార్ – 9440585704, 9849907742
ఖైరతాబాద్ – 7995009080
కూకట్‌పల్లి – 7993360308, 9515050849
శేరిలింగంపల్లి – 6309529286,9989930253
సికింద్రాబాద్ – 7993360302,9100091948