ఘటోత్కచుడు @ 25

by Jakkula Samataha |
ఘటోత్కచుడు @ 25
X

దిశ వెబ్ డెస్క్: కమెడియన్ గా ‘అలీ’ ఎంత విజయవంతమయ్యాడో మనందరికీ తెలుసు. కానీ కమెడియన్ ను హీరోగా మలిచి.. గోల్డెన్ జూబ్లి హిట్ అందివ్వడమంటే.. అది మామూలు విషయం కాదు. ఆ ఘనత ఎస్వీ కృష్ణారెడ్డికే సొంతం. ఆ ఇద్దరి కాంబోలో వచ్చిన ఆ చిత్రమే ‘యమలీల’. ఆ తర్వాత వాళ్లిద్దరి కలయికలో మరో చిత్రం వస్తుందంటే.. ప్రేక్షకుల్లో తప్పకుండా ఆసక్తి ఉంటుంది. వారి అంచనాలకు ఏ మాత్రం దక్కకుండా.. రూపొందిన చిత్రమే ‘ఘటోత్కచుడు’. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 1995 ఏప్రిల్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన, ఈ సినిమా .. పాతికేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ఘటోత్కచుడిగా నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ నటించారు. రోజా, ఆలీ, రాజశేఖర్, శ్రీకాంత్, కోటా శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, శరత్ బాబు వంటి తారలెంతోమంది ఇందులో నటించారు. అక్కినేని నాగార్జున ఒక స్పెషల్ సాంగ్‌లో తళుక్కున మెరవడం మరో ప్రత్యేకత. ఓ సారి ఆ సోషియో ఫాంటసీ కథలోకి, ఆ రోజుల్లోకి మనమూ వెళ్లొద్దాం.

మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల.. ఇలా వెండితెరపై ఎస్వీ కృష్ణారెడ్డి సృష్టించిన మాయజాలం అంతా ఇంతా కాదు. వేటికవే భిన్నమైన సినిమాలు తీసి ప్రేక్షకులకు థ్రిల్ ను అందించారు. కమెడియన్ గా కొనసాగుతున్న అలీని సిల్వర్ స్క్రీన్ పై ‘యమలీల’ తో హీరోగా ప్రజెంట్ చేసి.. హిట్టు కొట్టారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి తీసిన అద్భుతమైన సోషియా ఫాంటసీ చిత్రమే ‘ఘటోత్కచుడు’. ‘ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఘటోత్కచుడికి.. నీళ్లు అందించి దాహం తీరుస్తుంది బేబీ నిఖిత. దానికి కృతజ్ఞతగా… నీకు ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో ఏ ఆపద వచ్చిన నన్ను తలుచుకో అని ఆ పాపకు వరమిస్తాడు. వందల సంవత్సరాల తర్వాత బేబీ నిఖిత మళ్లీ పుడుతుంది. ఆ పాపకు ఒకానొక సమమయంలో ఆపద వస్తే.. ఆమెను రక్షించడానికి ఘటోత్కచుడు వస్తాడు. ఆ పాపను రక్షించే క్రమంలో ఎదురైన సంఘనలే క్లుప్తంగా ఈ సినిమా కథ. పాపకు, ఘటోత్కచుడి మధ్యలో వచ్చే భావోద్వేగపు సన్నివేశాలు ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టిస్తాయి. ఈ చిత్రంలో హీరోగా అలీ నటించిగా, ఆయనకు జోడిగా రోజా నటించారు. యమలీలలో యముడిగా అలరించిన కైకాల సత్యనారాయణ … ఘటోత్కచుడు సినిమాలో టైటిల్ రోల్ పోషించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సినిమా కథ మొత్తం ఆయనే చుట్టే తిరుగుతుంది. ఆయన పాత్ర చిత్రానికే హైలెట్ గా నిలిచింది. సత్యనారాయణ కూడా ఆ పాత్రకు ప్రాణం పోశారు. ఇక బేబీ నిఖిత కూడా చాలా చక్కగా నటించింది. సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సుబ్బారావ్. ఇక్కడ సుబ్బారావ్ అంటే మనిషి కాదో.. రోబో. తెలుగు సినిమా చరిత్రలో తొలి రోబో క్యారెక్టర్ రూపొందించింది ఎస్వీ కృష్ణారెడ్డినే. రోజా – రోబో ల మధ్య లవ్ ట్రాక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రోబో తో రోజా పాడే ‘డింగు డింగు రోబోట్ కి .. గుండెలో గంట కొట్టే లవ్వాటకి’ అనే పాట ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. ఈ సినిమాలోని పాటలన్నీ కూడా సూపర్ హిట్ సాధించాయి. ఎస్వీ కృష్ణారెడ్డినే ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. రోబో చేసే తమాషా పనులు చిన్నారులతో పాటు, పెద్దలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఘటోత్కచుడి మాయలు కూడా ప్రేక్షకుల్లో నవ్వులు పూయించాయి. ఏవీయస్, బ్రహ్మనందంల కామెడీ కూడా సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించింది. కర్ణుడిగా యాంగ్రీ హీరో రాజశేఖర్, కృష్ణుడిగా చక్రపాణి, అర్జునుడిగా శ్రీకాంత్ నటించడంతో ఆ రోజుల్లోనే మల్టీస్టారర్ సినిమాగా నిలిచింది. అంతేకాదు ఇందులో నాగార్జున కూడా ఓ పాటలో మెరవడం సినిమాకు మరో అదనపు ఆకర్షణగా నిలిచింది. మనీషా ఫిలిమ్స్ బ్యానర్‌తో , ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. అందుకు తగ్గట్లుగానే నిర్మాత అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిలది ఈ సినిమాతో వాళ్లది హిట్ కాంబో అని మరోసారి నిరూపితమైంది.

tags :ghatithkachudu, tollywood, telugu cinema, socio fantacy, sv krishna redyy, ali, roja, robot

Advertisement

Next Story