- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, ఫీచర్స్ : కొవిడ్ మహమ్మారి కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్లను డబ్ల్యూహెచ్ఓ ఆమోదించగా, పలు దేశాలు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన విషయం విదితమే. భారత్‌లో ఇప్పటికే 45 ఏళ్లకు పైబడిన వారికి టీకా ప్రక్రియ ప్రారంభించగా, వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఓ రెస్టారెంట్ క్రేజీ ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్లు ప్రూఫ్ చూపిస్తే ఒక బీర్ ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. రేపు (ఏప్రిల్ 7) నేషనల్ బీర్ డే సందర్భంగా ‘సెలబ్రేట్ యువర్ వ్యాక్సినేషన్ విత్ ఇండియన్ గ్రిల్ రూమ్’ స్లోగన్‌తో ఈ ఆఫర్ ఇస్తున్నట్లు గురుగ్రామ్‌లోని ఇండియన్ గ్రిల్ రూమ్ రెస్టారెంట్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ మేరకు కొవిడ్ ఫస్ట్ ప్లస్ సెకండ్ డోస్ తీసుకున్న వారు వ్యాక్సినేషన్ కార్డు లేదా ఇంకేదైనా తీసుకున్నట్లు ప్రూఫ్ చూపిస్తే ఈ నెల 5 నుంచి ఒక బీర్‌ను ఇస్తున్నారు. వారం రోజుల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుందని తెలిపారు. అయితే వ్యాక్సిన్ నిబంధనల మేరకు ఆల్కహాల్ తీసుకోవద్దని సూచిస్తుండగా, వ్యాక్సిన్ పేరిట బీర్ల ఆఫర్ ప్రకటించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆల్కహాల్ లేని నార్మల్ డ్రింక్స్ లేదా పర్సంటేజ్ అతి తక్కువ ఉన్న డ్రింక్స్ మాత్రమే ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.