జర్మన్ ఓపెన్ రద్దుకు కారణమిదే

by Shiva |   ( Updated:2021-02-11 10:52:03.0  )
జర్మన్ ఓపెన్ రద్దుకు కారణమిదే
X

దిశ, స్పోర్ట్స్ : యోనెక్స్ జర్మన్ ఓపెన్ 2021ను ఈ ఏడాదికి రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300లో భాగమైన జర్మన్ ఓపెన్ మార్చి 9 నుంచి 14 వరకు జరగాల్సి ఉన్నది. అయితే జర్మనీలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో నిర్వాహకులు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్)తో చర్చించిన అనంతరం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ టోర్నీ రద్దు వల్ల ఒలంపిక్స్ క్వాలిఫయర్స్‌పై ప్రభావం పడదని తెలియజేశారు. మరోవైపు జనవరిలో విడుదల చేసిన బీడబ్ల్యూఎఫ్ క్యాలెండర్‌లో పలు టోర్నీలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరగకపోవచ్చని అధికారులు అంటున్నారు. ఇంకా పలు దేశాల్లో రెండో దశ కరోనా వేవ్ కారణంగానే టోర్నీలు నిర్వహించడం భారంగా మారినట్లు తెలియజేశారు.

Advertisement

Next Story