- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్డు లేని సినీ కార్మికులకు నిత్యావసరాలు అందించిన జార్జిరెడ్డి టీం
దిశ వెబ్ డెస్క్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించాల్సి వచ్చింది. లాక్‌డౌన్ కారణంగా షూటింగులు రద్దు అయ్యాయి. దాంతో సినీ కార్మికులకు చేతిలో పనులు లేకుండా పోయాయి. పని చేస్తేనే వారి కడుపు నిండుతుంది. పని లేక, తిండి లేక సినీ కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడానికి ఇప్పటికే సినీ పెద్దలు విరాళాలు అందించారు. అయితే ఆ సహాయం కార్డుదారులకే లభించింది. కార్డులు లేని కార్మికులు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటివారిని ఆదుకోవడానికి ‘జార్జి రెడ్డి ’మూవీ టీం ముందుకు వచ్చింది. ‘జార్జిరెడ్డి’ సినిమా టీం. కార్డులేని వంద మంది సినీ కార్మికులకు ఆదివారం నూనె, ఉల్లిపాయలు, కందిపప్పు అందించారు. పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించారు. జార్జిరెడ్డి చిత్ర నిర్మాతలు అన్నపురెడ్డి అప్పిరెడ్డి, దామురెడ్డి, దర్శకుడు జీవన్ రెడ్డి సహా చిత్ర కథానాయకుడు సందీప్ కార్మికులకు సరుకులు అందించారు.
Tags: george reddy team, cinema , film workers, charity, corona, lock down