- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కిమ్స్‌లో వాటా విక్రయించనున్న జనరల్ అట్లాంటిక్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కిమ్స్ హాస్పిటల్స్‌లో దాదాపు సగం వాటాను విక్రయించనున్నట్టు తెలుస్తోంది. జనరల్ అట్లాంటిక్ సంస్థకు కిమ్స్ హాస్పిటల్‌లో 40.91 శాతం వాటా ఉంది. ఇందులో 18 శాతానికిపైగా వాటాను ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ) ద్వారా విక్రయించాలని చూస్తోంది. జనరల్ అట్లాంటిక్ సంస్థ కిమ్స్‌లో మూడు సంవత్సరాలుగా పెట్టుబడులు పెడుతోంది. గత నెల జనరల్ అట్లాంటిక్ బోర్డు కిమ్స్ హాస్పిటల్‌లో వాటా అమ్మకానికి తీర్మానించింది. ‘ కిమ్స్ హాస్పిటల్స్ ఐపీఓ ద్వారా సుమారు రూ. 700 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇందులో తాజా ఇష్యూ ద్వారా రూ. 200 కోట్లను సమీకరించనుంది. దీనికోసం సెబీకి దరఖాస్తు చేసింది. ఈ నిధులను సుమారు రూ. 150 కోట్ల రుణాలను చెల్లించేందుకు వినియోగించనున్నట్టు, అలాగే మిగిలింది మూలధన వ్యయం, వ్యూహాత్మక కార్యక్రమాలకు, జాయింట్ వెంచర్ కోసం వినియోగించనున్నట్టు తెలుస్తోంది.