- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తగ్గిన ఆభరణాల ఎగుమతులు
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో దేశీయంగా రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో రూ. 63,339.58 కోట్లకు పడిపోయాయి. గతేడాది ఇదే కాలంలో ఎగుమతి అయిన వాటి విలువ రూ. 1,04,295.97 కోట్లతో పోలిస్తే ఇది 39.27 శాతం తక్కువ. కేవలం సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఎగుమతులు కూడా రూ. 18,143.87 కోట్లకు క్షీణించాయి.
2019, సెప్టెంబర్ నెలలో ఈ ఎగుమతులు రూ. 24,156.99 కోట్లతో పోల్చితే 24.89 శాతం తక్కువగానే ఉన్నాయని రత్నాలు, ఆభరణాల ఎగుమతుల సంఘం(జీజేఈపీసీ) గణాంకాలు వెల్లడించాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మొత్తం బంగారు ఆభరణాల ఎగుమతులు రూ. 9,926.57 కోట్లు నమోదవగా, గతేడాది ఇదే కాలంలో ఎగుమతి చేసిన రూ. 43,425.22 కోట్లతో పోలిస్తే 64.48 శాతం తక్కువ.
‘రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,25,249.46 కోట్ల నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరానికి 20-25 శాతం తగ్గుతాయని భావిస్తున్నాం. వచ్చే ఏడాది నాటికి పరిశ్రమ 2019-20 స్థాయికి చేరుకుంటుందని, 2021-22 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని’ సోమవారం వర్చువల్‌గా జరిగిన అంతర్జాతీయ ఆభరణాల ప్రదర్శన(ఐఐజేఎస్) ముగింపు సమావేశంలో జీజేఈపీసీ ఛైర్మన్ కొలిన్ షా చెప్పారు.