గీతం కౌటిల్య స్కూల్ విద్యార్థులకు జాతీయ స్థాయి స్కాలర్ షిప్

by Shyam |
Kautilya School
X

దిశ, పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా హైదరాబాద్ లో నెలకొల్పిన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ 2021 విద్యా సంవత్సరానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన మౌఖిక ఇంటర్వ్యూ ద్వారా నలుగురు విద్యార్థులకు జాతీయ స్కాలర్ షిప్ లను ప్రకటించింది. ప్రభుత్వాల విధాన నిర్ణయాలను రూపొందించడంలో సహకరించడం, పరిపాలనా పరమైన నిర్ణయాలలో మార్గదర్శకం చేయడం వంటి అంశాలలో నిపుణులైన యువతకు మార్గదర్శకం వహించడం లక్ష్యంగా కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ రెండేళ్ళ కాలవ్యవధి గల పీజీ కోర్సును నిర్వహిస్తోందని స్కూల్ డైరెక్టర్ పి.శ్రీధర్ తెలిపారు.

భారతీయ విలువలు, సామాజిక అంశాలను పాశ్చ్యాత్త దేశాల ఆలోచనా విధానం జోడించి కోర్స్ రూపొందించామని, జాతీయ స్థాయిలో నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ ఉంటుందన్నారు. స్కూల్ ప్రవేశాల సందర్భంగా ప్రతిభ గల విద్యార్థులను ఎంపిక చేసి ఉచిత విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యక్తి గత ఇంటర్వ్యూలు, రాత పరీక్షలో ప్రతిభ చూపిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వసీం అహ్మద్, మహ్మద్ హబీబుల్లా, కలకత్తాకు చెందిన రత్న 100 శాతం స్కాలర్ షిప్ నకు, బీహర్ కు చెందిన ప్రీతిష్ ఆనంద్ 50 శాతం స్కాలర్ షిప్ సాధించారని స్కూల్ డైరెక్టర్ ప్రకటించారు. గీతం కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ప్రవేశ వివరాలకు http://apply.koutilya.org.in/ పరిశీలించాల్సిందిగా సూచించారు.

Advertisement

Next Story

Most Viewed