- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్చి నాటికి సానుకూల వృద్ధి : నీలేష్ షా!
దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ సింగిల్ డిజిట్‌కి మెరుగుపడుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఆర్థికవ్యవస్థ తిరిగి సానుకూల వృద్ధికి చేరుకుంటుందని భావిస్తున్నట్టు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు నీలేష్ షా చెప్పారు. ప్రధానంగా విదేశీ నిధుల ప్రవాహం పెరగడం ఒక కారణమని, ఇప్పటికే నవంబర్ నెలకు సంబంధించి రూ. 45 వేల కోట్లకు పైగా మార్కెట్లలో విదేశీ నిధులు వచ్చాయని, దీనికిముందు రెండేళ్లలో లేనంత స్థాయిలో విదేశీ నిధులు మార్కెట్లలోకి రావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కఠినమైన లాక్‌డౌన్ కారణంగా జూన్ త్రైమాసికంలో జీడీపీ 23.9 శాతం కుదించుకుపోయింది.
అలాగే, పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 14 శాతం ప్రతికూలంగా ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయన్నారు. ఏదేమైనప్పటికీ ఇటీవల ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడంతో జీడీపీ 9.5 శాతం ప్రతికూలంగా ఉండొచ్చై ఆర్‌బీఐ అంచనా వేసింది. అయితే, పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని, సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు డబుల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్‌కు చేరుకోవచ్చని, వచ్చే ఏడాది మారి నాటికి సానుకూల జీడీపీ ఆశిస్తున్నట్టు నీలేష్ వివరించారు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ బ్రోకర్ల ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, దేశంలో సెకండ్ వేవ్ వ్యాక్సి పురోగతి మీద ఆధార పడి ఉంటుందన్నారు.