ఆ హీరోతో సీక్రెట్ లవ్‌లో ఉన్న బాలీవుడ్ హీరోయిన్

by Jakkula Samataha |
ఆ హీరోతో సీక్రెట్ లవ్‌లో ఉన్న బాలీవుడ్ హీరోయిన్
X

దిశ, సినిమా : హీరోయిన్ గాయత్రి అయ్యర్ శాండల్‌వుడ్‌తో తనకున్న అనుంబధాన్ని పంచుకుంది. ‘టైసన్’, ‘జగ్గూ దాదా’ లాంటి సూపర్ హిట్ కన్నడ ఫిల్మ్స్‌లో నటించిన ఆమె.. ఆ తర్వాత హిందీ ప్రాజెక్ట్‌లపై కాన్సంట్రేట్ చేసింది. ఇక ఈ మధ్యే ఓ కన్నడ ప్రాజెక్ట్ ఓకే చేసిన భామ.. మళ్లీ కన్నడ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉందని తెలిపింది. శాండల్‌వుడ్ తన మనసుకు చాలా దగ్గరైందని, తనను ఓన్ చైల్డ్‌లా ట్రీట్ చేసిందని చెప్పిన గాయత్రి.. ఫిల్మ్ మేకర్స్, ఫ్యాన్స్ నుంచి అందుకున్న ప్రేమ, ప్రశంసలు మరిచిపోలేనని వెల్లడించింది. ఈ క్రమంలో ‘జగ్గూ దాదా’ కోస్టార్ దర్శన్‌పై తనకున్న క్రష్ రివీల్ చేసిన భామ.. ఎక్స్‌ట్రీమ్‌లీ డ్యాషింగ్, సూపర్ హ్యాండ్సమ్ దర్శన్‌తో మళ్లీ పనిచేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది. అంతేకాదు హీరో గణేష్‌తోనూ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఇష్టపడుతున్నానని వివరించింది.

Advertisement

Next Story