‘సంజు ఉత్తముడు.. చర్చకు సిద్ధమా’

by Shyam |
‘సంజు ఉత్తముడు.. చర్చకు సిద్ధమా’
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున టాప్ ఆర్డర్‌లో వచ్చే సంచలన బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్. ప్రతి మ్యాచ్‌లో అతడి ఆట తీరు ప్రత్యేకం. జాతీయ జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్న సంజు.. ఈ రోజు జరుగుతున్న సీఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్‌లో చేలరేగి ఆడాడు. కేవలం 32 బంతుల్లో 74 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. సంజు ఆట తీరు పై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించాడు.

తాజాగా గౌతమ్ గంభీర్ ట్వీట్ చేస్తూ.. ‘సంజు శాంసన్ భారతదేశంలో ఉత్తమ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు.. ఇండియాలోనే ఉత్తమ యువ బ్యాట్స్‌మెన్ కూడా.. దీని పై చర్చకు సిద్ధమా’ అంటూ ప్రశ్నించాడు.

Advertisement

Next Story