గంభీర్‌కు పాకిస్తాన్ నుంచే ఈ మెయిల్స్.. బయటపెట్టిన పోలీసులు

by Shyam |   ( Updated:2021-11-25 07:35:54.0  )
గంభీర్‌కు పాకిస్తాన్ నుంచే ఈ మెయిల్స్.. బయటపెట్టిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు చంపుతామని బెదిరిస్తూ బుధవారం రెండు మెయిల్స్ వచ్చాయి. ఈ బెదిరింపుల నేపథ్యంలో గంభీర్ నివాసం వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్తాన్‌కు చెందిన సాహిద్ హమీద్ అనే అకౌంట్ హ్యాండ్లర్ నుంచి ఈ మెయిల్స్ వచ్చినట్లు గుర్తించారు. అంతేకాకుండా, ఈ-మెయిల్ గురించి మరింత తెలుసుకోవడానికి పోలీసు సీనియర్ అధికారులు సైబర్ సెల్‌కు కూడా సమాచారం అందించారు.

Advertisement

Next Story