- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆసియా అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ!?
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఎకనమిక్ టైమ్స్ తాజా నివేదికల ప్రకారం.. ముఖేష్ అంబానీ సంపద గత కొద్దిరోజులుగా రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) షేర్ల పతనం కారణంగా తగ్గింది. మరోవైపు 2020 నుంచి గౌతమ్ అదానీ సంపద గణనీయంగా పెరిగింది. 2020, మార్చి నాటికి గౌతమ్ అదానీ నికర విలువ 4.91 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 1,808 శాతం పెరిగి 83.89 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఇదే సమయంలో ఆర్ఐఎల్ అధినేత ముఖేశ్ అంబానీ సంపద 250 శాతం మాత్రమే పెరిగింది. బ్లూమ్‌బర్గ్ బిలీయనీర్స్ జాబితా ప్రకారం అదానీ సంపద విలువ 88.8 బిలియన్ డాలర్లుగా సూచిస్తోంది. ఇది ముఖేష్ అంబానీ నికర విలువ కంటే కేవలం 2.2 బిలియన్ డాలర్లు తక్కువగా ఉంది. బుధవరం నాటి పరిణామాల్లో సౌదీ ఆరామ్‌కోతో ఒప్పందం రద్దు ప్రకటన తర్వాత ఆర్ఐఎల్ షేర్లు దాదాపు 2 శాతం క్షీణించాయి. ఇదే సమయంలో అదానీ సంపద 2.4 శాతం మేర పుంజుకుంది. దీంతో ముఖేష్ అంబానీ సంపద తగ్గి అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారని ఎకనమిక్ టైమ్స్ వెల్లడించింది
ఎకనమిక్ టైమ్స్ ప్రకారం.. బుధవారం ఆర్ఐఎల్ షేర్ 1.77 శాతం పడిపోయి రూ. 2,343.55 వద్ద ట్రేడయింది. అదానీ గ్రూప్ షేర్ 2.34 శాతం పుంజుకుని రూ. 1,747.95 వద్ద ర్యాలీ చేసింది. అదానీ గ్రూపునకు చెందిన ఇతర కంపెనీల షేర్లు సైతం మెరుగ్గా లాభపడ్డాయని, దీంతో ఆసియా బిలీయనీర్ల జాబితాలో రెండో స్థానం నుంచి గౌతమ్ అదానీ అగ్రస్థానాన్ని చేరుకున్నారని వెల్లడించింది.