పిల్లలను ఎప్పుడు కంటావ్?.. నటి అదిరిపోయే సమాధానం

by Shyam |   ( Updated:2021-08-04 05:28:45.0  )
Gauhar Khan
X

దిశ, సినిమా: బాలీవుడ్ యాక్ట్రెస్ గౌహర్ ఖాన్ తన గురించి ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్నవారికి కరెక్ట్ సమాధానమిచ్చింది. ఇలాగే ఎందుకు ఉంటున్నావ్? అలా ఎందుకు ఉండకూడదు? అని ప్రతీసారి ప్రశ్నించే వారికి డ్యాన్స్ చేస్తూ ఆన్సర్ చెప్పింది. పెళ్లి అయినప్పటి నుంచి ఎదుర్కొంటున్న ప్రశ్నలకు వీడియో ద్వారా రిప్లై ఇచ్చింది. ఎప్పుడు పిల్లలకు జన్మనిస్తావు? అన్న క్వశ్చన్‌కు అల్లా కరుణించినప్పుడు తప్పకుండా ఇస్తానన్న గౌహర్ ఖాన్.. నువ్వు అత్తమామలతో కలిసి ఎందుకు ఉండట్లేదు? అని ప్రశ్నించగా తన భర్తతో కలిసి తమకు సూట్ అయిందే చూజ్ చేసుకున్నామని తెలిపింది. పెళ్లి అయినప్పటి నుంచి ఎందుకు వర్క్ చేస్తూనే ఉన్నావ్ ? అంటే ‘20 ఏళ్లుగా చేస్తూనే ఉన్నా ఇప్పుడు కూడా చేస్తున్నా. నాకు 80ఏళ్లు వచ్చే వరకు ఇలాగే చేస్తా’ అని సమాధానమిచ్చింది.

Advertisement

Next Story