ఎఫెక్ట్ కరోనా… గరివిడి ఫేకర్ మూత

by srinivas |
ఎఫెక్ట్ కరోనా… గరివిడి ఫేకర్ మూత
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం పరిశ్రమలపై పడుతోంది. కరోనా కారణంగా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ముడి సరుకుల రవాణా లేకపోవడంతో కంపెనీని నిర్వహించలేమని యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ప్రముఖ కంపెనీగా పేరొందిన గరివిడి ఫేకర్‌ పరిశ్రమ లేఆఫ్‌ ప్రకటించింది.

ఫేకర్ పరిశ్రమకు ఒడిశా నుంచి హైకార్బన్‌ ఓర్ సరఫరా అవుతోంది. లాక్‌డౌన్‌ నేపధ్యంలో అరకొరగానే సరఫరా జరిగింది. ఉన్న కాస్త నిల్వలతో యాజమాన్యం ఇప్పటివరకూ నెట్టుకొచ్చింది. కానీ గత వారం రోజులుగా సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో నేటి నుంచి పరిశ్రమను మూసివేయడానినికి నిర్ణయించారు.

పరిశ్రమలో గరివిడి, దువ్వాం, దుమ్మెద , దేవాడ , తాటివాడ , గుర్ల మండలం పెనుబర్తి, చింతపల్లిపేట తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయి. పరిశ్రమ మూతపడితే పరిస్థితి ఏమిటన్న ఆందోళన వారిలో నెలకొంది. దీనిపై కంపెనీ యజమాన్యం స్పందిస్తూ, ఓర్‌ సరఫరా నిలిచిపోవడం వల్ల పరిశ్రమకు కొన్ని రోజుల పాటు లేఆఫ్‌ ప్రకటిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed