జగన్ వెంటే నడుస్తా: గంటా

by srinivas |
జగన్ వెంటే నడుస్తా: గంటా
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అందరూ కలిసికట్టుగా పోరాడాలని మాజీ మంత్రి, విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం జరిగిపోయిందని, పార్లమెంట్‌లో సాక్షాత్తూ ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ప్రజలను మభ్యపెడుతోందని, ఇప్పటికైనా సీఎం జగన్ సరైన నిర్ణయం తీసుకోవాలని గంటా సూచించారు.

అవసరమైతే ప్రధాని, కేంద్రమంత్రులను కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జగన్ కోరాలని గంటా సూచించారు. విశాఖ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెడుతుందని ఆరోపించిన గంటా.. జగన్ ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. కావాలంటే జగన్ వెంట టీడీపీ నేతలందరితో పాటు తాను కూడా కూడా నడుస్తానన్నారు. ప్రైవేటీకరణపై పవన్ స్పందించాలని, ఏపీ బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.

రాజీనామాల చివరి అస్త్రానికి సమయం ఆసన్నమైందని, రాజీనామాలకు అందరూ సిద్ధం కావాలన్నారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తే కేంద్రం దిగొస్తుందని, ప్రైవేటీకరణతో ఉద్యోగులు, కార్మికులు, నిర్వాసితులకు ముప్పు అని గంటా తెలిపారు. ప్లాంట్‌ను కాపాడుకునేందుకు నిర్మాణాత్మకమైన ప్రణాళిక రూపొందించాలని, నిర్మాణాత్మకమైన ప్రణాళికతో వైసీపీ సర్కార్ నేడే ముందుకు రావాలని గంటా చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed