- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అద్దె ఇంట్లో గంజాయి మొక్కల సాగు.. పోలీసుల సడెన్ ఎంట్రీ
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి హైదరాబాద్‌లో గంజాయి సాగు కలకలం రేపుతోంది. కొందరు ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతూ పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటన గురువారం మేడ్చల్ మల్కారంలో వెలుగులోకి వచ్చింది. అయాజ్ ఖాన్ అనే వ్యక్తి మల్కారంలో అద్దెకు ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నాడు. అతడు ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. అక్కడ గంజాయి మొక్కలను గుర్తించిన పోలీసులు వాటిని ధ్వంసం చేశారు.
అనంతరం కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా అతడు ఇప్పటివరకు గంజాయిని ఎవరికైనా అమ్మాడా? ఎవరెవరితో అతడికి సంబంధాలు ఉన్నాయి? అతడికి గంజాయి మొక్కలు ఎవరు ఇచ్చారు? ఇలా మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story