- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యాసంగిలో ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం: గంగుల
దిశ, కరీంనగర్ సిటీ : ఈ యాసంగిలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కనీస మద్ధతు ధరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర బి.సి. సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన యాసంగి 2020-21 ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కనీస మద్ధతు ధర పై కొనుగోలు చేస్తుందని అన్నారు. ధాన్యం సేకరణకు జిల్లాలో 351 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ యాసంగి సీజన్ లో మొత్తం 6.34 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుమతి అంచనా వేయగా, అందులో 4.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయుటకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన ఏ గ్రేడ్ రకానికి రూ. 1,888/- రూ.లు, సాధారణ రకానికి రూ.1,868/- రూ.లు చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు పండించిన తమ ధాన్యాన్ని ఆరబెట్టి తాలు లేకుండా, 17 శాతం తేమకు మించకుండా నాణ్యమైన ధాన్యాన్నికొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత రెడ్డి,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.