స్పెషల్ ఫ్లైట్ కోసం ఈటల ఎన్ని కోళ్లు అమ్మారు..?

by Shyam |
Eatala Rajender Bjp
X

దిశ, వెబ్‌డెస్క్: నేటి నుంచి ఎన్నికలు పూర్తయ్యేవరకు హుజురాబాద్‌లోనే ఉంటాను అంటూ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని.. రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. కేవలం ఆస్తులను పెంచుకోవడం కోసమే హుజురాబాద్‌ను ఈటల గాలికి వదిలేశారని.. చివరకు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని.. ఆస్తుల కోసమే ఆరాటపడుతున్నారని గంగుల ఆరోపించారు. ఈటల తీరుతో హుజురాబాద్ ఇవాళ గుడ్డి దీపంలా మారిందన్నారు. స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీ వెళ్లిన ఈటల రాజేందర్ ఎన్ని కోళ్లు అమ్మి ఉంటారని గంగుల ఎద్దేవా చేశారు. రాష్ట్రమంతా భగీరథ నీళ్లు పొంగుతుంటే.. భూముల కబ్జాలతో ఈటల ఎదిగారన్నారు. తెలంగాణ భావితరాల భవిష్యత్తు టీఆర్ఎస్‌తోనే సాధ్యం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story