ఆ మూడు సినిమాలు థియేటర్‌కా? ఓటీటీకా?

by Shyam |
ఆ మూడు సినిమాలు థియేటర్‌కా? ఓటీటీకా?
X

దిశ, సినిమా : కొవిడ్ పాండమిక్ అనేక బిజినెస్‌లపై ప్రభావం చూపగా.. అందులో థియేటర్ బిజినెస్ కూడా ఒకటి. మార్చి 2020 నుంచి గత నెల వరకు దేశంలోని థియేటర్లలో ఏ సినిమా కూడా ప్రాపర్‌గా రిలీజ్ కాకపోగా.. ఇప్పుడు కూడా చాలా ప్రదేశాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతోనే రన్ అవుతున్నాయి. దీంతో మేకర్స్ ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. గత నెలలో అక్షయ్ ‘బెల్ బాటమ్’తో పాటు అమితాబ్, ఇమ్రాన్ హష్మీ నటించిన ‘చెహ్రే’ థియేటర్స్‌లోనే రిలీజైనా.. పెద్ద సినిమాలు చాలావరకు వేచిచూసే ధోరణినే అవలంబిస్తున్నాయి లేదంటే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంజయ్‌లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడి’, రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాల థియేట్రికల్ రిలీజ్‌పైనా సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. కాగా ఈ పరిస్థితులపై ‘పెన్ స్టూడియోస్’ చైర్మన్ జయంతిలాల్ స్టేట్‌మెంట్ విడుదల చేశారు.

‘గంగూబాయి కతియావాడి, ఆర్‌ఆర్‌ఆర్, అటాక్ సినిమాలు థియేటర్స్‌లోనే విడుదలవుతాయని స్పష్టం చేస్తున్నాం. అంతకుముందే ఓటీటీలో రిలీజ్ అవుతాయనే రూమర్స్ నిజం కావు. బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని తీసిన ఈ సినిమాలను ఖచ్చితంగా థియేటర్‌లోనే రిలీజ్ చేస్తాం’ అని జయంతిలాల్ తన ప్రకటనలో తెలిపారు. జులై 30న రిలీజ్ కావాల్సిన గంగూబాయి వాయిదాపడగా.. రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ అక్టోబర్ 13న విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed