- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూపీలో మరో గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్..
దిశ, వెబ్‌డెస్క్ :ఉత్తరప్రదేశ్‌లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. లక్నోలోని సరోజిని నగర్ పీఎస్ సమీపంలో జరిగిన కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ రాకేశ్ పాండేను యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (STF) పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఇటీవల గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే 8 మంది పోలీసులను హతమార్చిన విషయం తెలిసిందే. దీనిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం మధ్యప్రదేశ్‌లో ఉన్న దూబెను ప్రాణాలతో తీసుకొచ్చి యూపీలో మట్టుపెట్టారు. ఆ తర్వాత యూపీలో గ్యాంగ్ స్టర్‌లను ఏరివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ నేపథ్యంలోనే వికాస్ దూబే అనుచరులను పోలీసులు ఏరివేస్తున్నారు.
వివరాల్లోకెళితే.. లక్నో శివారులో ఉన్న రాకేశ్ పాండేను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, అతడు పోలీసులపైకి కాల్పులు జరిపాడు. దాంతో అతడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్కౌంటర్ చేసారు. 1993 నుంచి పాండే నేరాలను అలవాటుగా మార్చుకున్నాడు. 2005లో బీజేపీ నేత కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో ఇతడు ప్రధాన నిందితుడు. మరోవైపు యూపీలోని కిరాతక గ్యాంగ్ ముక్తార్ అన్సారీ అనే గ్యాంగ్‌లో రాకేష్ పాండే సభ్యుడిగా ఉన్నాడు. ఇక 2010 నుంచి పాండే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా …ఎట్టకేలకు ఈరోజు ఆ గ్యాంగ్ స్టర్‌ను పోలీసులు మట్టుబెట్టారు.