సీఎంఆర్ఎఫ్‌కు గంగ‌పుత్ర సొసైటీ, రిటైర్డ్ డాక్టర్ విరాళాలు

by Shyam |
సీఎంఆర్ఎఫ్‌కు గంగ‌పుత్ర సొసైటీ, రిటైర్డ్ డాక్టర్ విరాళాలు
X

దిశ, వరంగల్: ముఖ్యమంత్రి స‌హాయ నిధికి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ‘ది వ‌రంగ‌ల్ డిస్ట్రిక్ట్ గంగ‌పుత్ర (బెస్త‌) మ్యూచువ‌ల్లీ ఎయిడెడ్ కో ఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ’ వారు, రిటైర్డ్ డాక్టర్ టి.వి రమణాకర్‌లు రూ.ల‌క్ష చొప్పున విరాళం ప్రకటించారు. సంబంధిత చెక్కులను రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా డి.రాజ‌లింగం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్ర‌జ‌లకు సీఎం చేస్తున్న కృషికి కొంత చేదోడు, వాదోడుగా త‌మ స‌హాయం ఉంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్, వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌న్మంతు త‌దిత‌రులు పాల్గొన్నారు.

tags: warangal gangaputhra society, retired doctor tv ramanakar, two lakh donation, cmrf, corona, virus,

Advertisement

Next Story