అమ్మాయిపై గ్యాంగ్ రేప్… నిందితులు నిస్సిగ్గుగా ఏం చేశారంటే?

by Sumithra |   ( Updated:2021-03-26 02:50:00.0  )
అమ్మాయిపై గ్యాంగ్ రేప్… నిందితులు నిస్సిగ్గుగా ఏం చేశారంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచం టెక్నాలజీ తో ఎంత ముందుకు పోతున్నా.. మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మహిళలు, బాలికలు, చిన్నారులు అనే తేడా లేకుండా క్రూర మృగాళ్లు లైంగికంగా వేధిస్తున్నారు. లైంగికంగా వేధించడంతో పాటు, ఆ దృశ్యాలను వీడియోలో బంధించి పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. తాజాగా ఇలాంటి పైశాచికానందానికి తెగబడిన ఒక ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది. యూపీ లో మహిళలపై లైంగిక వేధింపులు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. ఒక 20 ఏళ్ళ యువతిని గౌరవ్‌, వికాస్‌, పుష్పరాజ్‌, సౌరభ్‌ అనే నలుగురు విద్యార్థులు బలవంతంగా రూమ్ కి తీసుకువెళ్లి లైంగికంగా వేధించారు.

అంతేకాకుండా ఆ అకృత్యాన్ని నిస్సిగ్గుగా వీడియోలో బంధించారు. ఈ విషయాన్ని పోలీసులకు చెపితే ఆ వీడియో బయటపెడతామని బెదిరించారు. మార్చి 21 అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎట్టకేలకు ధైర్యం చేసిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story