ఫోటో షూట్ కోసం వెళ్లిన మోడల్‌.. డ్రింక్స్‌లో డ్రగ్స్‌ మిక్స్ చేసి లాడ్జీలో మూడు రోజులు..

by Sumithra |   ( Updated:2021-12-07 00:20:02.0  )
ఫోటో షూట్ కోసం వెళ్లిన మోడల్‌.. డ్రింక్స్‌లో డ్రగ్స్‌ మిక్స్ చేసి లాడ్జీలో మూడు రోజులు..
X

దిశ, వెబ్ డెస్క్: ఫొటోషూట్‌ కోసం వెళ్లిన మోడల్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కేరళలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మలప్పురం నివాసి అయిన మహిళకు డ్రగ్స్ కలిపిన పానీయాలు ఇచ్చారని, ఆ తర్వాత తాను ఉంటున్న లాడ్జిలో ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళ ఆరోపించినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 3 వరకు గ్యాంగ్ రేప్ చేసినట్లు మహిళ ఫిర్యాదు చేసిందన్నారు. నిందితులు ఆమెను రేప్ చేసిందంతా రికార్డ్ చేసి, బ్లాక్ మెయిల్ చేసి, బెదిరించి మళ్లీ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుల్లో ఒకడైన సలీం కుమార్ (33)ని అరెస్టు చేశామని, మహిళపై అత్యాచారానికి పాల్పడిన మరో ఇద్దరు అజ్మల్, షమీర్ కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మలప్పురం నివాసి అయిన మహిళ తన ఫిర్యాదులో తాను ఫోటో షూట్ కోసం ఇక్కడికి వచ్చానని, అలప్పుజ లో నివాసం ఉంటున్న కుమార్ తనకు తెలుసు కాబట్టి అతను బస చేయడానికి లాడ్జీ ని ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. అయితే, ఆ తర్వాత లాడ్జి యజమాని సహకారంతో ముగ్గురు నిందితులు ఆమెకు డ్రగ్స్ కలిపిన పానీయాలు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసిందన్నారు. ఈ ఘటనపై ఇన్ఫో పార్క్ పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed