పోలీసుల పేరిట మోసాలు..ముఠా అరెస్ట్…

by Sumithra |
పోలీసుల పేరిట మోసాలు..ముఠా అరెస్ట్…
X

దిశ సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలో షీ టీమ్ పోలీసుల మంటూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఎస్పీ మోహన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… వనపర్తి జిల్లా కు చెందిన యువతి హైదరాబాదులోని మహిళా ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ప్రైవేట్ ఎంప్లాయిగా పనిచేస్తోంది. కాగా సూర్యాపేట జిల్లా రాయినిగూడెం గ్రామానికి చెందిన యువకుడితో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కాగా పెళ్ళికి ఆ వ్యక్తి నిరాకరించాడు. దీంతో ఆగస్టు 11న సూర్యాపేట జిల్లా పోలీసులను ఆ యువతి ఆశ్రయించింది. దీంతో ఇరువురిని పిలిపించి పోలీసులు విచారించి,కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఆ యువకుడికి అప్పటికే వివాహం అయింది. దీంతో ఇద్దరూ ఎవరికివారు విడివిడిగా ఉండాలని పెద్దమనుషులు తీర్మానించారు.నాలుగు లక్షల రూపాయలు యువతికి ఇచ్చే విధంగా పెద్దమనుషుల ఒప్పందం కుదిర్చారు. కాగా దీన్ని అవకాశంగా యువతి స్నేహితులైన విజయ్,ప్రవీణ మరియు విజయ్ స్నేహితురాలైన మరొక యువతి వాడుకోవాలనుకున్నారు. యువతి దగ్గరకు వెళ్లి షీటీమ్ పోలీసులకు రెండు లక్షలు ఇవ్వాలని చెప్పారు. ఆ తర్వాత యువతికి షీ టీమ్స్ కానిస్టేబుల్ పేరిట విజయ్ తమ్ముడు సుమన్ తో ఫోన్ చేయించారు. దీంతో యువతి వారి అకౌంట్ కు 2 లక్షలు ట్రాన్స్ ఫర్ చేసింది. కాగా ఈ నెల 11న ఈ విషయంపై పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ నిర్వహించారు. విజయ్ తో పాటు, ప్రవీణ్, కావ్యలను అరెస్టు చేశారు. కాగా మరొకరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి లక్షా ఎనభై వేల రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

Read Also…

దళిత సర్పంచ్ పై హత్యాయత్నం

Advertisement

Next Story