డుమ్మా కొడితే సస్పెండ్ చేయండి: ఎమ్మెల్యే

by Shyam |   ( Updated:2020-06-19 08:38:38.0  )
డుమ్మా కొడితే సస్పెండ్ చేయండి: ఎమ్మెల్యే
X

దిశ, వరంగల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు విధులకు గైర్హాజరు అయితే ఉపేక్షించేది లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి హెచ్చరించారు. నియోజకవర్గంలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత రేగొండ ఆస్పత్రికి చేరుకున్న ఆయన డాక్టర్, సిబ్బంది అందుబాటులో ఉండడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం భూపాలపల్లి, ఒడితల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్‌లో సిబ్బంది లేకపోవడాన్ని గమనించిన ఎమ్మెల్యే డీఎంహెచ్‌వోను పిలిచి గైర్హాజరు అయిన వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఒడితల హాస్పిటల్‌లో 20 మందికి బదులుగా.. ఇద్దరే సిబ్బంది అందుబాటులో ఉండటాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇంకోసారి సారి ఇలా జరిగితే సహించేది లేదని గండ్ర వెంకట రమణారెడ్డి మండిపడ్డారు.

Advertisement

Next Story