- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా పేషెంట్‌ను వెనక్కి పంపిన గాంధీ సిబ్బంది!
X
దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని పీపల్ పహాడ్ గ్రామస్థునికి సోమవారం నాడు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య సిబ్బంది ధృవీకరించారు. బాధితుడు ఇటీవల టాంజానియా దేశం నుండి వచ్చాడు. కానీ, బుధవారం గాంధీ ఆసుపత్రి సిబ్బంది కరోనా లక్షణాలు లేవని తిరిగి ఇంటికి పంపించారు. దీంతో పీపల్ పహాడ్ గ్రామస్తులు కరోనా పాజిటివ్ అని తేలిన వ్యక్తిని తిరిగి లక్షణాలు లేవని పంపడం సరికాదంటూ బెడ్స్ ఖాళీ లేకనే తిప్పి పంపుతున్నారని ఆరోపించారు. గ్రామస్తులు అంతా కలిసి కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని గ్రామంలోకి రానివ్వమంటూ అంబులెన్సును అడ్డుకున్నారు. స్థానిక పోలీసులు, వైద్య సిబ్బంది సర్ది చెప్పడంతో శాంతించారు. బాధితుడిని హోం క్వారంటైనికు తరలించారు.
Advertisement
Next Story