చేతులెత్తేస్తున్న గాంధీ వైద్యులు

by Shyam |
చేతులెత్తేస్తున్న గాంధీ వైద్యులు
X

దిశ, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రికి కోవిడ్(కరోనా) లక్షణాలతో బాధితులు క్యూ కడుతున్నారు. మైండ్ స్పేస్‌లో పనిచేసే ఓ ఇంజినీర్‌కు కరోనా నిర్ధారణ అయినట్టు తెలుస్తుండగా, ఇప్పటికే గాంధీలో మహింద్రాహిల్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇదే పేషెంట్‌కు వైద్య సేవలు అందిస్తున్న నర్సుకు కూడా కరోనా లక్షణాలు వ్యాపించినట్టుగా సమాచారం. దీంతో నగరంలో కరోనా బాధితులు 3‌కు చేరారు. అయితే, మీడియాలో కరోనాపై ఎప్పటికప్పుడు వార్తల సమాచారం ప్రచారం అవుతుండగా..ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రావాలంటేనే తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత కొందరు ఐటీ ఉద్యోగులు పరీక్షలు చేయించుకోవడానికి గాంధీ ఆస్పత్రికి రాగా, వారి వద్ద టూర్ ట్రావెలింగ్ సమాచారం లేనందున వెనక్కి పంపారు. దీంతో ఐటీ ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం పంపిన 47 పరీక్షల్లో 45 మందికి కరోనా లేదని తేలడంతో వారిని ఇళ్లకు పంపినట్టు వైద్యులు చెబుతున్నారు.

tags : carona virus, gandhi hospital, hyderabad

Advertisement

Next Story

Most Viewed