నార్వే యాక్టర్ క్రిస్టోఫర్‌ హివ్జుకు కరోనా

by Shyam |
నార్వే యాక్టర్ క్రిస్టోఫర్‌ హివ్జుకు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ స్టార్ క్రిస్టోఫర్ హివ్జు కరోనా బారిన పడినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ సందేశం పంపించారు. ఈ విషయం గురించి చెప్పాల్సి వస్తున్నందుకు క్షమించాలన్న నార్వే యాక్టర్… పరీక్షల్లో తనకు కోవిడ్ 19 పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. నేను, నా కుటుంబం ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం బాగానే ఉందని.. తనకు మాత్రం కొంచెం జలుబు లక్షణాలు ఉన్నాయన్నారు. వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున మీరంతా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని.. ఇతరుల నుంచి 1.5 మీటర్ల దూరంలోనైనా ఉండాలన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా మీరు చేయగలిగినదంతా చేయాలని కోరారు. కలిసి పోరాడితేనే ఈ సంక్షోభాన్ని నివారించగలమన్న క్రిస్టోఫర్.. దయచేసి ఒకరిని మరొకరు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. మీ మీ దేశాల్లో ప్రభుత్వం అందిస్తున్న సూచనలు అనుసరిస్తూ.. మిమ్మల్ని మీరు కరోనా నుంచి రక్షించుకోవడమే కాదు.. మొత్తం సమాజాన్ని సురక్షితంగా ఉంచాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా వృద్ధుల విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలన్నారు.

View this post on Instagram

Greetings from Norway! Sorry to say that I, today, have tested positive for COVID19, Corona virus. My familiy and I are self-isolating at home for as long as it takes. We are in good health – I only have mild symptoms of a cold. There are people at higher risk for who this virus might be a devastating diagnosis, so I urge all of you to be extremely careful; wash your hands, keep 1,5 meters distance from others, go in quarantine; just do everything you can to stop the virus from spreading. Together we can fight this virus and avert a crisis at our hospitals. Please take care of each other, keep your distance, and stay healthy! Please visit your country’s Center for Disease Control’s website, and follow the regulations for staying safe and protecting not just yourselves, but our entire community, and especially those at risk like the elderly and people with pre-existing conditions. @grymolvaerhivju #fightcorona #solidarity #takecare #folkehelseinstituttet Thanks to @panoramaagency

A post shared by Kristofer Hivju (@khivju) on


Tags: Kristofer Hivju, CoronaVirus, Covid 19, Game of Thrones

Advertisement

Next Story

Most Viewed