- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీ కేర్ ఫుల్.. ప్రమాదకర దశ ఆరంభమైంది: గల్లా
చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రమాదకర దశ ఆరంభమైందని చెబుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని విధంగా కరోనా వైరస్ కేసులు పెరిగిపోయాయి. మొదట్లో అత్యల్పంగా నమోదైన కరోనా కేసులు గత రెండు రోజులుగా జోరందుకున్నాయి. ప్రధానంగా నిన్న రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు 43 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 87కి చేరింది.
ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఏపీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ లో 43 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం కేసులు 87కు చేరాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని విన్నవిస్తున్నా. కరోనా విస్తరించకుండా అందరూ సామాజిక దూరాన్ని పాటించండి. అందరి సహకారంతోనే కరోనాను కట్టడి చేయగలం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
అంతే కాకుండా మన కంటికి కనిపించని శత్రువుతో మనం యుద్దం చేస్తున్నామని ఆయన అన్నారు. ఇందులో ప్రమాదకరమైన దశ మొదలైందని ఆయన పేర్కొన్నారు. రానున్న 7 రోజులు కరోనా నియంత్రణలో చాలా కీలకమైనవని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే అందరూ ఇంట్లోనే ఉండాలని, బయటి నుంచి ఎవరినీ రానివ్వొద్దని ఆయన సూచించారు. బయటి నుంచి వచ్చే వారు కుటుంబసభ్యులైనా సరే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. కరోనాను ఎవరూ తేలికగా తీసుకోవద్దని ఆయన సూచించారు. మన మనుగడ మన చేతుల్లోనే ఉందని ఆయన జాగ్రత్తలు చెప్పారు.
Tags: galla jayadev, galla, tdp mp, corona virus, ap, tweet, twitter