గాలి జనార్ధన్ రెడ్డి‌కి పాజిటివ్..

by Anukaran |   ( Updated:2020-08-30 11:45:51.0  )
గాలి జనార్ధన్ రెడ్డి‌కి పాజిటివ్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఓబులాపురం మైనింగ్ స్కాంలో నేరస్థుడిగా ఉన్న క‌ర్ణాట‌క‌ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. 2015వ సంవత్సరంలో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఆదివారం బళ్లారిలో కర్ణాటక ఆరోగ్య మంత్రి బీ శ్రీరాములు తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సుప్రీంకోర్టు నుంచి రెండ్రోజుల పాటు గాలి జనార్ధన్ అనుమతి తీసుకున్నారు.

అయితే, తాజాగా నిర్వహించిన టెస్టుల్లో ఆయనకు పాజిటివ్ రావడంతో అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నాని ఫేస్‌బుక్‌లో ద్వారా వెల్లడించారు. అతనిలో లక్షణాలు లేకున్నా కరోనా సోకినట్లు నిర్ధార‌ణ అయ్యిందని వైద్యాధికారులు తెలిపారు.

Advertisement

Next Story